ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని అజీర్ణం, గ్యాస్ సమస్యలు వేధిస్తున్నాయి. తేలికపాటి వంటింటి చిట్కాలతో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. వేయించిన వామును రాక్ సాల్ట్‌తో నీళ్లతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలకు సులభంగా, వేగంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయి. వాములో ఫైబర్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
సాల్ట్‌తో కలిపి వాము తీసుకుంటే అజీర్తి, అసిడిటీ నయమవుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్ణ సమస్య తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. దాని వెనుకే గ్యాస్ సమస్య కూడా వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ మందులపై ఆధారపడటం ఏ మాత్రం మంచిది కాదని కచ్చితంగా చెప్పవచ్చు.
సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని నమిలినా, వాటిని మరిగించి తయారు చేసిన ద్రవాన్ని తాగినా జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. జీర్ణాశయంలో చల్లదనాన్ని పెంచడంలో పుదీనా సహాయపడటంతో పాటు కడుపు నొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
వాము, రాక్‌సాల్ట్ రెండూ శరీరంలోని ఇతర మినరల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. వాము జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూడటంతో పాటు వంటకాల రుచిని కూడా పెంచడంలో సహాయపడుతుంది. పంటి నొప్పి కూడా వాముతో నయమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. యాంటీబయాటిక్ ఔషధ గుణాలతో అర్ధరైటిస్ నుంచి కూడా ఉపశమనం లభించే ఛాన్స్ ఉంటుంది.
ఆహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలడం ద్వారా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆమ్ల తటస్థీకరణకు సహాయపడే లాక్టిక్ ఆమ్లం మజ్జిగలో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అజీర్ణానికి గురైనప్పుడు చల్లని మజ్జిగ ఒక కప్పు తాగితే మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది.