మనలో చాలామంది జీలకర్ర నీరు తాగడానికి ఇష్టపడతారు. జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జీరా నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. ఉబ్బరం, వికారం, మలబద్ధకం వంటి సమస్యలను ఈ నీరు సులువుగా తగ్గిస్తుంది. జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి ఈ నీళ్లు సహాయపడతాయని కచ్చితంగా చెప్పవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచడంలో జీరా నీరు సహాయపడుతుందని చెప్పవచ్చు. శరీరం నుంచి విషాలను జీరా నీరు సులువుగానే తొలగిస్తుంది. ఆకలి హార్మోన్లను అణిచివేయడంలో ఇది తోడ్పడుతుంది. రక్తహీనతను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. రక్తపోటును నియంత్రంచడంలో జీలకర్రకు తిరుగులేదని కచ్చితంగా చెప్పవచ్చు. షుగర్ వ్యాధితో బాధ పడేవాళ్లు జీలకర్ర నీళ్లు కచ్చితంగా తాగాలి.
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, విటమిన్లు, మినరల్స్, సాల్ట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయని చెప్పవచ్చు. జీలకర్రను రాత్రంతా నానబెట్టి, ఉడకబెట్టడం వల్ల జీలకర్ర నీరు సులువుగా తయారు చేసే అవకాశం ఉంటుంది. జీలకర్రను నీటిలో వేసి మరిగించి, అది మరిగిన తర్వాత, జీలకర్రను నీటిలో కొంత సమయం నానబెట్టడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.
జీలకర్ర కడుపు సమస్యలను చాలా వరకు నయం చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జీలకర్ర వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉదయం సమయంలో జీలకర్ర నీరును తాగడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.