ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించాలంటే రోజువారి ఆహారంలో ఇవి తప్పనిసరి!

మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే చిరుధాన్యాలైన రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, ఊదలు, హారికలు వంటి వాటిని ఆధునిక పోకడలతో పక్కన పడేసి మన ఆరోగ్యానికి చేటు తెచ్చే ఫాస్ట్ ఫుడ్ పదార్థాలైన పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్ వంటి జంక్ ఫుడ్ కు అలవాటు పడి అనారోగ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా షుగర్, బిపి, ఉబకాయం, గుండెపోటు ప్రమాదాలు నానాటికి పెరిగిపోవడానికి కారణం అధిక కార్బోహైడ్రేట్స్ అత్యల్ప ఫైబర్ కలిగిన బియ్యాన్ని ఎక్కువగా ఆహారంలో వినియోగించడమేనని అనేక పరిశోధనలు వెల్లడింది.

రోజువారి ఆహారంలో కనీసం ఒక్క పూటైనా రాగి చిరుధాన్యాన్ని ఆహారంగా వినియోగిస్త మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. మరియు కార్బోహైడ్రేట్స్, కొవ్వులు తక్కువ పరిమాణంలో లభ్యమవుతాయి కావున రాగి చిరుధాన్యంతో తయారుచేసే రాగి రొట్టెలు, రాగి జావా,రాగి ముద్ద వంటి వంటకాలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో రాగి ధాన్యాన్ని ఉపయోగిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్యంలో అందరినీ బాధించే ఎముక సంబంధిత వ్యాధులు,కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడాలంటే రోజువారి ఆహారంలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న రాగులను ఆహారంగా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రాగుల్లో అత్యధికంగా లభించే ఫైబర్, ట్రిఫ్టోపాన్ అనే అమైనో ఆసిడ్స్ జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయ సమస్యను దూరం చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. మరియు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్, క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించి అన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది.