గోరుచిక్కుడుకాయల్లో మన సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ వీటిని తినడానికి చాలామంది సంకోచిస్తుంటారు. దీనికి గల కారణం గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న ఒకే ఒక అపోహ మాత్రమే. గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ , కాల్షియం మెగ్నీషియం ఫైబర్ , ఐరన్, జింక్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూట్రిషన్ వైద్యుల సూచన ప్రకారం క్యాలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్స్, ఫైబర్,విటమిన్స్ సమృద్ధిగా లభించే గోరుచిక్కుడుకాయలను ఆహారంగా తీసుకుంటే అతి బరువు సమస్యతో బాధపడేవారు సులువుగా శరీర బరువును నియంత్రించుకోవచ్చునని అలాగే చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉబకాయం, గుండె జబ్బులు ,రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా లభించే ఐరన్, విటమిన్ బి12 రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తరచూ గోరుచిక్కుడు తో చేసిన ఆహారాన్ని తీసుకుంటే రక్త కణాల ఉత్పత్తి సక్రమంగా జరిగి అలసట నీరసం వంటి సమస్యలు తొలగిపోవడమే కాకుండా శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. గోరుచిక్కుడు లో సమృద్ధిగా లభించే కాల్షియం, జింక్ ఎముకలు దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
మధుమేహ సమస్యతో బాధపడేవారు తరచు ఈ గోరుచిక్కుడు గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో సమృద్ధిగా లభించే పీచు పదార్థం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరించి మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి శరీరంలోని చెడు మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లోని కొవ్వు నిల్వలను తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని, హైబీపీ సమస్యను కూడా నియంత్రిస్తుంది. కావున ఎలాంటి ఆపోహాలు పెట్టుకోకుండా సీజనల్గా దొరికే గోరు చిక్కుడుకాయలను ఆహారంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు..