ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన కర్పూరవల్లి మొక్కలోని ఆకుల్లో మరియు కాండంలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఈ మొక్క ఆకుల కషాయాన్ని సేవిస్తే అనేక దీర్ఘకాలిక వ్యాధులను సైతం నియంత్రించవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.కర్పూరవల్లి మొక్కలు మన ఇంటి పెరట్లో చక్కగా పెరుగుతాయి. ఈ మొక్కల నుంచి వెలువడే ఘాటైన సువాసన క్రిమి కీటకాలను ఇంటి పరిసరాల నుంచి దూరంగా తరిమికొడుతుంది.కర్పూరవల్లి మొక్కను కొన్ని ప్రాంతాల్లో వెన్న చెట్టు,వాము చెట్టు, కప్పరిల్లాకు అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.
కర్పూరవల్లి మొక్క ఆకుల్లో విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. కర్పూరవల్లి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కావున ఈ ఆకుల్లో కొంత ఉప్పు వేసి బాగా నమిలి ఆ రసాన్ని మింగితే తీవ్రమైన దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, కప్పం వంటి ఫ్లూ లక్షణాలు తొలగిపోతాయి.కర్పూరవల్లి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు నాడీ కణ వ్యవస్థను ప్రేరేపించి మనలో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
కర్పూరవల్లి ఆకు రసాన్ని తీసి గోరువెచ్చగా చేసుకొన్న తర్వాత సేవిస్తే సైనస్ వంటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుంది.ఆస్మా, ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు కర్పూరవల్లి ఆకులను బాగా నలిపి దాని వాసన పీల్చుకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోతుంది.
అలాగే కర్పూరవల్లి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు,యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మూత్రశయ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు తరచు ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే వీటిలో ఉన్న ఔషధ గుణాలు ప్రమాదకర సూక్ష్మ జీవులను నశింపజేసి మూత్రశయ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు తరచూ ఈ ఆకు కషాయాన్ని సేవిస్తే మన శరీరంలోని సోడియం నిల్వలను తగ్గించడంతోపాటు కిడ్నీలో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
జీర్ణ సంబంధ వ్యాధులైన అజీర్తి, కడుపులో పుండ్లు , అల్సర్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడేవారు కర్పూరవల్లి ఆకులను తిన్న లేదా ఈ ఆకుల కషాయాన్ని ప్రతిరోజు సేవించిన మనలో అరుగుదల శక్తి పెరిగి అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.