తమలపాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ అవగాహన ఉంటుంది. అనాదిగా మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యంలో తమలపాకు వినియోగించి ఎన్నో రకాల మొండి వ్యాధులకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. తమలపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియన్ గుణాలు మన శరీరంలోని వ్యాధి కారకాలను సమర్ధవంతంగా నియంత్రించడంలో తోడ్పడి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
తమలపాకు మరియు లవంగాలను నీటిలో బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తరచూ జలుబు, దగ్గు, జ్వరం, వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడేవారు తమలపాకు కషాయాన్ని ఊపిరితిత్తులు, వాయునాళాల్లోని ఇన్ఫెక్షన్ తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరియు శరీరంలోని చెడు మలినాలను తొలగించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.తమలపాకును తిన్నప్పుడు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు నోట్లోని ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి నోటి దుర్వాసన, దంత క్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి.
తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడేవారు తమలపాకు మెత్తటి మిశ్రమంగా చేసి నుదుటిపై కాసేపు పెట్టుకుంటే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరియు తమలపాకు మిశ్రమాన్ని అరిచేతులు అరికాళ్ళకు రాసుకుంటే రక్త ప్రసరణ పెరిగి అరికాళ్ళ,అరచేయి మంటలు తిమ్మిర్లు వంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు తమలపాకు కషాయం సేవిస్తే శరీరంలో అధికంగా ఉండే యూరిక్ యాసిడ్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతాయి. డిప్రెషన్ ఆందోళన చిరాకు వంటి సమస్యలతో బాధపడేవారు తమలపాకు రసాన్ని సేవిస్తే మెదడు ప్రశాంతత కలిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.