సాధారణంగా పొద్దు తిరుగుడు గింజలని నల్ల కుసుములు అని కూడా పిలుస్తారు. వీటినుంచి తీసే సన్ ఫ్లవర్ ఆయిల్ వంట నూనెల్లో బాగా ప్రాచుర్యం పొందింది. మనలో చాలామంది పొద్దుతిరుగుడు గింజలని వేపుకుని కాలక్షేపం కోసం తింటుంటారు. అయితే వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పొద్దు తిరుగుడు గింజల్లో సమృద్ధిగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ,మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఎంజైములు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఎన్నో సహజ పోషక పదార్థాలు మెండుగా లభ్యమవుతాయి.
గుండెపోటు, హైబీపీ సమస్య ఉన్నవారు నిక్షేపంగా పొద్దుతిరుగుడు గింజలను ఆహారంగా తీసుకోవచ్చు.
పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండెకు మేలు చేస్తుంది స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చు. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా హై బీపీ, లో బిపి సమస్యలను కంట్రోల్ చేస్తుంది. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్ ఏ, కంటి చూపుకు అవసరమైన రెటీనా పనితీరును మెరుగుపరిచి కంటి లోపాలను సరిచేస్తుంది. మరియు బ్యూటీ విటమిన్ గా పిలిచే విటమిన్ ఈ గింజల్లో సమృద్ధిగా లభించడం వల్ల చర్మం సహజ అందాన్ని పెంపొందించడంలో సహాయ పడడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తరచూ పొద్దు తిరుగుడు గింజలను ఆహారంగా తీసుకుంటే థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ హార్మోన్ శ్రవించడంలో లోపాలు తొలగిపోతాయి.హార్మోన్ల సమస్యలు, ఆసమతుల్యత ఉన్నవారు పొద్దు తిరుగుడు గింజలు తింటే మంచిది. దీని వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను దృఢపరిచి మెదడు కండరాలను శాంత పరుస్తుంది తద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోతాయి.