మైదా పిండిలో ఆ రసాయనాలు కలుపుతారని మీకు తెలుసా.. అవి తింటే ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది మైదా పిండితో చేసిన వంటకాలను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. అయితే మైదా పిండి బూడిదతో సమానమని చాలామందికి తెలియదు. మైదా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. మైదాతో చేసిన వంటకాలను ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్లను క్యాన్సర్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

మైదా పిండి తయారీలో ఉపయోగించే బ్రోమైట్ శరీరానికి ఎంతో హాని చేస్తుంది. గోడలకు పోస్టర్లు అతికించడానికి ఉపయోగించే మైదాపిండి ఒక రకంగా స్లో పాయిజన్ అని చెప్పవచ్చు. మైదా తింటే కొన్ని కీటకాలు ప్రాణాలు కోల్పోతాయంటే మైదా తినడం వల్ల శరీరానికి ఏ స్థాయిలో హాని కలుగుతుందో సులువుగానే అర్థమవుతుంది. హల్వాలు, బొబ్బట్లు, బ్రెడ్ కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

కేకులు, కాజాలు, జిలేబీలు తినడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం ఉండదు. రవ్వదోసెలు, పరోటా, రుమాలీ రోటీ కూడా మైదా పిండితో తయారు చేస్తారు. ఈ వంటకాలు కూడా ఆరోగ్యానికి చెడు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హోటళ్లలో చాలా వంటకాలను మైదా మిక్స్ చేసి చేస్తారు. అందువల్ల హోటళలో వంటకాలను తినేవాళ్లు జాగ్రత్తగా ఉంటే మంచిది

అజోడికార్బోనోమైడ్, క్లోరీన్ గ్యాస్, బెంజోల్ పెరాక్సైడ్ లను ఉపయోగించి మైదా పిండి తయారు చేస్తారు. ఈ విధంగా తయారు చేయడం వల్ల మైదా పిండి తెల్లగా ఉంటుంది. మైదా పిండి రేటు కూడా తక్కువనే సంగతి తెలిసిందే. మైదా పిండితో చేసిన వంటకాలకు ఇకనైనా దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.