రోజూ కాటుక పెట్టుకుంటే కళ్లు ఇలా మారతాయట.. జాగ్రత్త పడాల్సిందే!

అమ్మాయిలలో చాలామంది కాటుక పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కాటుక పెట్టుకోవడం వల్ల చూడటానికి అందంగా కనిపిస్తారు. కాటుక పెట్టుకోవడం వల్ల కంటికి, శరీరానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాటుకలో లెడ్ ఉంటుంది. ఇది శరీరంలో ఇంకి మెదడు, ఎముకలపై దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాటుకలో పారాబెన్స్, భారలోహాలు ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

కాటుకలోని కెమికల్స్ వల్ల కళ్ల కింది కనురెప్పల్లోని నూనెగ్రంథులు తెరచుకునే ఛాన్స్ ఉండదు. రోజూ కాటుక పెట్టుకోవడం వల్ల కంటి చూపు ప్రాణాంతకంగా మారే అవకాశాలుంటాయి. కాటుక వల్ల కళ్ల చుట్టూ నల్లటి చారలు ఏర్పడతాయని చెప్పవచ్చు. కాటుక వల్ల రక్తహీనత సమస్య తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది. కాటుకను మేకప్ రిమూవర్‌తో తొలగించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

అందాన్ని రెట్టింపు చేయడంలో కాటుకదే పైచేయి కాగా కాటుక వల్ల కళ్లకు వచ్చే అందం అంతాఇంతా కాదు. కాటుక వల్ల కనురెప్పల్లో నూనె గ్రంథులు తగ్గి అలర్జీలు, కార్నియల్‌ అల్సర్లు, గ్లకోమా వంటివి వస్తాయి. అరుదుగా వేసుకునేవారైనా ఈ జాగ్రత్తలు పాటించకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. కళ్లను తరచూ రుద్దడం వల్ల కాటుక నేరుగా మీ చర్మంలోని పై పొరల ద్వారా లోపలికి ఇంకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

మీకు పెరి-ఆర్బిటల్ ఎగ్జిమా లేదా డెర్మటైటిస్ ఉన్నప్పుడు కళ్లకు కాటుక అప్లై చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. చర్మంపై ప్రతికూల ప్రభావాలను నివారించాలంటే సహజమైన కాటుక ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే మేలు జరుగుతుంది. కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుందని చెప్పవచ్చు. కాటుక స్థానంలో ఐలైనర్, మస్కారా, ఐషాడో వంటివి వాడితే కంటిలోకి రసాయనాలు సులువుగా పోవు.