మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా?

ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో ఎముకల పెరుగుదల 20 సంవత్సరాల వరకు ఉండి 50 సంవత్సరాల తర్వాత పలుచబడి బలహీనంగా మారుతుంటాయి. కానీ ఈ రోజుల్లో క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్ల, పోషకాహార లోపం, మద్యపానం వంటి కారణాలతో చిన్న వయస్సులోనే ఎముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.కారణం శరీరంలో విటమిన్ డి లోపించడమే. మన శరీరంలో విటమిన్ డి ప్రాముఖ్యత? లోపిస్తే కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.

ఎముకలు దృఢంగా బలిష్టంగా ఉండాలంటే విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది.ఒక మనిషికి రోజుకు 600-800 iu విటమిన్‌ డీ అవసరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా విటమిన్ డీ సూర్య రష్మి నుంచి సహజ సిద్ధంగా,అతి చౌకగా మన శరీరానికి లభ్యమవుతుంది. అలాగే విటమిన్ డి పాలు, గుడ్లు ,సముద్రపు చేపలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, సిట్రస్ జాతి ఫలాలు, బెర్రీ ఫ్రూట్స్ లో కూడా సమృద్ధిగా లభిస్తుంది.

అయినప్పటికీ ఈ రోజుల్లో చాలామంది విటమిన్ డి లోపంతో ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి ఎముక సంబంధిత రుగ్మతలను ఎదుర్కొంటున్నారు.పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు
15 శాతం జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అంచనా వేస్తోంది. దీనికి గల కారణాలను పరిశీలిస్తే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు, పెద్దలు చదువు వృత్తిరీత్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీ గదులకే అంకితం కావడం వల్ల మన శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్ డి లభించలేదు. మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సమృద్ధిగా లభించాలంటే ఉదయం అరగంట మన శరీరానికి సూర్యరశ్మి తగిలేలా కూర్చోవాలి. లేదా కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం ,నడక , యోగా వంటివి చేయాలి.

శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఎముకల పెరుగుదల ఆగిపోయి దృఢత్వాన్ని కోల్పోయి పలుచగా మారి తొందరగా విరిగిపోతాయి.దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముక క్యాన్సర్, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. అలాగే కండరాల పెరుగుదలలో లోపం ఏర్పడి నీరసం ,అలసట, కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది కావున విటమిన్ డీ సమృద్ధిగా లభించే అన్ని రకాల ఆకుకూరలను, పండ్లు, కూరగాయలను తరచూ రోజువారి ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.