మీ శరీరంలో వేడి ఉందా.. వెంటనే ఈ చిట్కాలు పాటించండి!

శరీరంలో వేడిని చాలా సులభంగా తగ్గించాలంటే ఎక్కువగా నీళ్లు త్రాగాలి. రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా ఐదు లీటర్ల వరకు తాగవచ్చు. అయితే శరీరంలో వేడి ప్రధానంగా మనం తినే ఆహార పదార్థాలలో కారం అతిగా ఉండటం, ఇంకా రోజంతా తక్కువ నీళ్లు తాగడం, ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వంటి వాటి వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దీని ద్వారా మూత్రంలో మంట, నొప్పి, మూత్రం రంగు మారడం, వంటివి ప్రధాన లక్షణాలు.

శరీరంలో వేడి తగ్గాలి అంటే ఒక గ్లాసు వాటర్ లో కొంచెం జీలకర్ర, కొంచెం పట్టిక బెల్లంను కాసేపు నానబెట్టుకొని అందులో పట్టిక బెల్లం అంతా కరిగి పోయాక ఆ నీటిని రోజుకు రెండుసార్లు త్రాగడం ద్వారా సులువుగా ఒంట్లో వేడి తగ్గుతుంది. మనం జీలకర్ర, పట్టిక బెల్లంల మిశ్రమాన్ని మిక్సీ వేసుకొని రోజు ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ వేసుకుని తాగవచ్చు.

ఇంకా మజ్జిగను రోజుకు రెండు లేదా మూడుసార్లు కొద్దిగా నిమ్మరసంతో తీసుకున్న అది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా సబ్జా గింజలు మూడు లేదా నాలుగు స్పూన్లు నీటిలో నానబెట్టి కాస్త సమయం అయ్యాక అందులో కొంచెం నిమ్మరసం ఇంకా రుచి కోసం కాస్త తేనె వేసి తాగితే ఒంట్లో వేడి మాయం అవుతుంది. చెరుకు రసం ను ఐస్ లేకుండా త్రాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.

చిన్న పిల్లలలో వేడి ఎక్కువ అయినప్పుడు చర్మంపై పొక్కులు వంటివి వస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ లో ఒక టీ స్పూన్ తేనెను కలిపి ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం వలన శరీర వేడి తగ్గడమే కాకుండా చర్మంపై ఉన్న పొక్కులు కూడా తగ్గిపోతాయి. ఇంకా కొబ్బరి నీరుని నీటిని వాడడం వల్ల శరీర వేడిని అతి సులువుగా తగ్గించుకోవచ్చు.

పండ్ల రసాలను ఐసు ముక్కలు లేకుండా ఫ్రిడ్జ్ వాటర్ కలపకుండా తాగితే శ్రేయస్కరం, ఇంకా తాటికాయలు ఫ్రెష్ గా తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని సులువుగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి చిట్కాలతో శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.