మన నిత్య జీవితంలో ‘టీ’కి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉదయాన్నే కాసింత ఛాయ్ నోట్లో పడందే.. ఏ పని కూడా మొదలు కాదంటే అతిశయోక్తి కాదు. గంట గంటకు కూడా టీ తాగే వారు కూడా ఉంటారు. కొంత మందికి టీ వ్యసనం. ప్రస్తుతం ఛాయ్ లలో అనేక వెరైటీలు కూడా వస్తున్నాయి. అల్లం టీ, గ్రీన్ టీ, మసాలా టీ, తందూరి టీ ఇలా రకరకాల టీలు రావడంతో… ఛాయ్ ప్రియులు అన్నింటిని ట్రై చేస్తున్నారు. ఇలా ప్రతిరోజు టీ తాగటం వల్లమనకు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా అధిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కూడా కలిగిస్తుంది. అయితే ఎక్కువగా టీ తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం అయితే టీ తాగిన తర్వాత చాలామందికి ఇతర ఆహార పదార్థాలను తినే అలవాటు ఉంటుంది.
అయితే టీ తాగిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు జీర్ణం కావడాన్ని అడ్డుకోవడమే కాకుండా.. ఆహారంలోని పోషక విలువను శరీరం గ్రహించకుండా అవరోధాలు ఏర్పడుతాయని చెబుతున్నారు. అందుకే టీ తాగిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, ఖనిజాలు శోషణకు టీ అడ్డు తగులుతుందని తేలింది. ఛాయ్ లో ఉన్న టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అదే విధంగా గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. టానిన్లు అధిక సాంద్రతలో ప్రోటీన్, ఐరన్ శోషనకు నిరోధిస్తోంది. ఇటు వంటి సమయంలో ప్రోటీన్లు తిన్న తరువాత టీ తాగకూడదు.
పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తాగకుంటే మంచిదని చెబుతున్నారు. ఆకుకూరల్లో ఉండే గోయిట్రోజెన్లు థైరాయిడ్ ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణం అవుతుంటాయి. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత కూడా టీ ని తీసుకోవడం మానేయాలి. తృణధాన్యాలు, మిల్లెట్స్ లో ఫైటేల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇనుము, జింక్, మెగ్నీషియంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీ తాగిన తర్వాత మొలకలను తినకూడదు. ఈ విధంగా టీ తాగిన వెంటనే ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.