ప్రస్తుత కాలంలో పేపర్ కప్పుల్లో కాఫీలు, టీలు తాగడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే పేపర్ కప్పుల్లో కాఫీలు, టీలు తాగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పేపర్ కప్పులలో వేడి పానీయాలు పోయడం వల్ల పేపర్ కోటింగ్ కరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పాలి ఎథిలీన్, పాలి ప్రొపిలీన్ లాంటి పదార్థాలతో ఈ పేపర్ కప్పులు తయారవుతాయి.
డిస్పోజబుల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగడం స్లో పాయిజన్ తో సమానం అని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ కప్పుల ద్వారా జతయ్యే మైక్రో ప్లాస్టిక్స్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. టీ, కాఫీ లేదా ఏదైనా వేడి పానీయాన్ని పేపర్ కప్పులో పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ పలుచని పొర అంటే మైక్రోప్లాస్టిక్ నుండి చాలా చిన్న కణాలు బయటకు రావడం వల్ల అవి సులువుగా కాఫీ లేదా టీలో కరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎక్కువసార్లు పేపర్ కప్పుల్లో కాఫీ లేదా టీ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఒక పేపర్ కప్పులో సుమారుగా 20,000 నుండి 25,000 మైక్రోప్లాస్టిక్ చిన్న కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పేపర్ కప్పులు హార్మోన్ల అసమతుల్యతకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా పేపర్ కప్పులు కలిగిస్తాయి.
ఎక్కువగా పేపర్ కప్స్ ను వాడేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. బయట పేపర్ కప్పుల్లో టీ తాగేవాళ్లు ఇకనైనా ఆ అలవాటును మార్చుకుంటే మంచిది.