టీతో పాటు సిగరెట్ తాగుతున్నారా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

టీ తాగుతూ సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. సిగరెట్, టీ రెండూ శరీరానికి హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి, మరియు వాటిని కలిపి తాగడం వల్ల కలిగే నష్టాలు రెట్టింపు అవుతాయి. టీ మరియు సిగరెట్ రెండూ రక్తపోటును పెంచుతాయి ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి, గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రక్తనాళాలు సంకోచించి, రక్తపోటు పెరిగి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ సమస్యలు, చర్మ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటివి కూడా తలెత్తవచ్చు.

సిగరెట్ మరియు టీ రెండూ రక్తపోటును పెంచుతాయి, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి మరియు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సిగరెట్ మరియు టీ కలిపి తాగడం వల్ల అజీర్తి, మంట, పొట్టలో నొప్పి, మలబద్ధకం, అల్సర్స్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

సిగరెట్ ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, అస్తమా మరియు ఇతర ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది. సిగరెట్ మరియు టీ కలిపి తాగడం వల్ల ముఖంపై ముడతలు పడటం, చర్మం ముదురు రంగులోకి మారడం వంటి చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. టీ, సిగరెట్ కలిపి తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, చికాకు వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. టీ, సిగరెట్లను కలిపి తాగడం వల్ల గుండె జబ్బు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. పొగాకు వాడకం సాధారణంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులను ప్రభావితం చేసే వ్యాధులకు దారితీస్తుంది. ధూమపానం అనేక పరిస్థితులకు ప్రధాన ప్రమాద కారకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. గ్యాస్ట్రిక్ తోపాటు నోటి క్యాన్సర్లతో సహా క్యాన్సర్ అభివృద్ధి కారకమని పేర్కొంటున్నారు.