మనలో చాలామంది ఆహారపు అలవాట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆహారం విషయంలో కొన్నిసార్లు చిన్నచిన్న తప్పులు చేసినా ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. టీ తాగిన వెంటనే నీళ్లను తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. వేడి టీ తాగిన తర్వాత నీళ్లను తాగితే దంతాలు దెబ్బ తినే ఛాన్స్ అయితే ఉంటుంది. నోటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల దంతాల నరాలు దెబ్బ తింటాయి.
వేడి నీటిని తాగిన తర్వాత నీళ్లు తాగితే అల్సర్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే టీ తాగిన వెంటనే నీళ్లను తాగుతారో వాళ్లలో ముక్కు నుంచి రక్తం కారే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. టీ తాగిన వెంటనే చల్లటి నీళ్లు తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. టీ తాగకముందే నీళ్లు తాగడం ద్వారా ఈ సమస్యలను కొంతమేర అధిగమించే అవకాశాలు ఉంటాయి.
టీలో కెఫిన్ ఉండడం వల్ల చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే.. అసిడిటీ లేదా కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దంత సమస్యలు ఉన్నవారికి వేడి వేడిగా ఉండే ఆహార పానీయాలు గానీ.. చల్లగా ఉన్న పానీయాలు గానీ తీసుకుంటే దంతాలపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చలి లేదా వేడి రెండింటినీ ఒకేసారి తట్టుకోలేదు. వాతావరణానికి అనుగుణంగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఎండాకాలంలో నీళ్లు తాగిన తర్వాత టీ తాగితే ముక్కు ద్వారా రక్తస్రావమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.