Health Tips: ప్రతిరోజు పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవలసిందే..!

Health Tips:పాలలో శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. అయితే పాలు ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పాలు త్వరగా జీర్ణం కావు అని, ఎసిడిటీ సమస్యలు వస్తాయని, బరువు పెరుగుతారు అనే అపోహలో చాలా మంది ఉంటారు. ఈ కారణంగా అనేక మంది పాలను ఎక్కువ తాగడానికి భయపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు, అవేంటో ఇప్పుడు చూద్దాం.

పాలలో క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డి లతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. కాల్షియం ఎముకల ఆరోగ్యానికి, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ పాలలో 300 మిల్లీ గ్రాముల పొటాషియం, 8 గ్రాముల ప్రోటీన్లు, విటమిన్ డి తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు పాలు ఎన్నో పోషక పదార్థాలు అందిస్తాయి. అందుకే పాలను పోషకాల గని అని అంటారు.

బరువు తగ్గాలి అనుకునేవారు వెన్న తీసిన పాలు తాగడం వల్ల శారీరక బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. వెన్న తీయని పాలు లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ కొవ్వు పదార్థాలు శరీర బరువు పెరగడం లో తోడ్పడతాయి. వయసుతో సంబంధం లేకుండా వెన్న తీసిన పాలను ఎవరైనా ఎంత మోతాదులో అయిన తాగవచ్చు. పాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక చిన్న పిల్లలకు ఆవు పాలు తాగించడం శ్రేయస్కరం. యువకులు టోండ్ మిల్క్, వయసు పైబడినవారు స్కిమ్మెడ్ మిల్క్ తీసుకోవడం శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు. పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.