పాల ఉత్పత్తిలో ఒకటైన జున్నును ఆహారంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి ఉబకాయం, గుండె జబ్బులు, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయని చాలామంది జున్నును తినడానికి వెనకడుగు వేస్తుంటారు. జున్నులో అత్యధిక క్యాలరీలు, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ జున్నును తగిన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. జున్నును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జున్నులు అత్యధికంగా ప్రోటీన్స్, విటమిన్ డి, విటమిన్ ఈ, కాల్షియం, ఐరన్,మెగ్నీషియం వంటి పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. కావున శారీరక దృఢత్వంతో పాటు మానసిక పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. కాల్షియం ఎముకల పట్టుత్వాన్ని పెంచి వృద్ధాప్యంలో వచ్చే కీళ్లనొప్పుల సమస్యను దూరం చేస్తుంది. ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యలను దూరం చేస్తుంది. జున్నును తగిన పరిమాణంలో తీసుకుంటే ఇందులో ఉండే అమినో ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడి శరీర బరువును నియంతనంలో ఉంచుతుంది.
తాజా అధ్యయనాల ప్రకారం రోజుకు రెండు ఔన్సుల జున్నును ఆహారంగా తీసుకుంటే 20% గుండెజబ్బు వచ్చే ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది. అలాగే రోజుకు 3/4 ఔన్సుల జున్ను తినడం వల్ల ఎనిమిది శాతం టైపు2 డయాబెటిస్ ముప్పు తప్పుతుందని అధ్యయనం చెబుతోంది. తరచూ జున్ను తినేవారిలో మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరికి మలబద్దకం అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.అయితే జున్నును మోతాదుకు మించి తింటే మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడవచ్చు. కాబట్టి జున్నును తగిన మోతాదులో తీసుకోవడమే ఉత్తమం.