మీలో ఎవరైనా నోరు తెరిచి నిద్రపోతున్నారా? ఈ అనారోగ్య సమస్య ఉన్నట్టే?

మనలో చాలామంది నిద్రపోయేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ నోరు తెరిచి నిద్రపోతుంటారు. ఈ ప్రక్రియ అంతా వారికి తెలియకుండానే జరుగుతుంది. దానికి కారణాలను పరిశీలిస్తే నోరు తెరిచి నిద్రపోవడానికి కారణం స్లీప్ అప్నియా ఈ సమస్య సాధారణమైనది అయినప్పటికీ వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. స్లీప్ అప్నియా వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. దీనికి కారణం శ్వాస వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల ఇలా జరుగుతుంది. అయితే అందరూ
స్లీప్ అప్నియా వల్లే నోరు తెరిచి నిద్రపోతారని చెప్పలేము.మరికొందరు కొన్ని అనారోగ్యం కారణాల వల్ల కూడా నోరు తెరిచి నిద్రపోతుంటారు.

సాధారణంగా తీవ్రమైన జలుబు, దగ్గు, సైనస్ , న్యుమోనియా సమస్యలతో బాధపడేవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది కావున శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు నోటి ద్వారా ఆక్సిజన్ తీసుకోవడానికి వారికి తెలియకుండానే నిద్రలో ప్రయత్నం చేస్తుంటారు. ఉబ్బసం సమస్య ఉన్నవారు ఊపిరితిత్తుల అనారోగ్యం వల్ల తరచు శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారి శరీరం నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.

తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రాత్రిపూటే కాదు రోజంతా కూడా నోటి ద్వారే శ్వాస తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.నిజానికి ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు అతను వేగంగా శ్వాస తీసుకుంటాడు.వీరిలో రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. కావున ముక్కుల ద్వారా తీసుకునే ఆక్సిజన్ సరిపోక నోటి ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తారు.నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి శ్వాస సంబంధిత అలెర్జీలు కారణమంటున్నారు నిపుణులు. రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని రక్షించడానికి ఆ పదార్ధంపై దాడి చేసినప్పుడు అలెర్జీ వస్తుంది. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తి వేగంగా శ్వాస తీసుకుంటూ అలర్జీ కారకాన్ని బయటికి పంపడానికి వారికి తెలియకుండానే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల నోటి ద్వారా శ్వాస తీసుకునే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.