ప్రతిరోజు కచ్చితంగా తాగాల్సిన రుచికరమైన, ఆరోగ్యవంతమైన పానీయం ఇదేనని తెలుసా?

carrot-juice-1296x728-header

ఆధునిక కాలంలో రోజురోజుకు మారుతున్న ఆహారపు అలవాట్లు,పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా చాలామందిలో పోషకాహార లోపం తలెత్తి తీవ్రమైన మానసిక, శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.కావున పోషకాహార లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కాలంటే ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ ను అదనపు ఆహారంగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. రుచికరమైన, ఆరోగ్యవంతమైన క్యారెట్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మొదటగా తాజా క్యారెట్లను శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి.అందులోకి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, అల్లం, తేనె వేసుకుని గ్రైండ్ చేస్తే రుచికరమైన క్యారేజ్ జ్యూస్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ ,సి ,ఫైబర్, బీటా కెరోటిన్, ఫైటో కెమికల్స్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

క్యారెట్,దాల్చిన చెక్క,అల్లం, తేనె లో ఉన్న ఔషధ గుణాలు సీజనల్ గా మనపై ప్రభావితం చూపే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి.ప్రతిరోజు ఈ రుచికరమైన క్యారెట్ జ్యూస్ సేవిస్తే క్యారెట్ లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ బి12 కంటి చూపును, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. మరియు జీర్ణ వ్యవస్థ లోపాలను తొలగించి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు శరీరంలో పెరికే క్యాన్సర్ కణతలను నియంత్రించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యారెట్ లో సమృద్ధిగా లభించే పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండెపోటు, రక్తపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు క్యారెట్ జ్యూస్ సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.