శీతాకాలంలో పచ్చి శెనగ గింజలను ఆహారంగా తీసుకుంటే ఈ మొండి వ్యాధులకు చెక్ పెట్టొచ్చు తెలుసా?

శీతాకాలంలో మాత్రమే సమృద్ధిగా లభించే పచ్చి శెనగ గింజలను ఆహారంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.పచ్చి శెనగ కాయలను కాల్చుకొని మరియు వేయించుకొని తినడానికి చాలామంది ఇష్టపడతారు.పచ్చి శెనగ గింజల్లో అత్యధిక ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ లభించడంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఫోలేట్, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, కాల్షియం, అమైనో ఆమ్లాల, యాంటీ ఆక్సిడెంట్సు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. తరచూ వీటిని ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

శీతాకాలంలో పచ్చి శెనగ గింజలను ఎక్కువగా తింటే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్సు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే మన శరీర జీవక్రియలకు అవసరమైన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభించడంతో శారీరక, మానసిక దృఢత్వం పొందుతుంది.సాధారణంగా శీతాకాలంలో తలెత్తే గుండె సమస్యలను తగ్గించడంలో పచ్చి శనగలు ఎంతగానో తోడ్పడతాయి పచ్చి శనగ గింజల్లో సమృద్ధిగా లభించే పొటాషియం, మెగ్నీషియం ఫైబర్ రక్తనాళాల్లో మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించి రక్త ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సాధారణంగా చలికాలంలో జీర్ణ వ్యవస్థలో లోపాలు తలెత్తి మలబద్ధకం, గ్యాస్ట్రిక్ , అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను తగ్గించడంలో పచ్చి శనగ గింజలు ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా ఉదర క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సెనగ గింజల్లో సమృద్ధిగా ఉండే ప్రోటీన్స్ క్యాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు ఎముకలను, కండరాలను శక్తివంతం చేయడంలో సహాయపడి కండరాల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తాయి.పచ్చి శెనగలు గర్భిణీలకి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్, విటమిన్ బి9 రక్తహీనత సమస్యను తొలగించడమే కాకుండా పిండ అభివృద్ధిలో సహాయపడి రక్తస్రావాన్ని నియంత్రిస్తాయి.