ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా కాలంతో పోటీపడి పనిచేయాల్సి వస్తోంది. దీనికి తోడు సరైన ఆహారం తీసుకోకపోతే మనలో పోషకాహార లోపం తలెత్తి శారీరక, మానసిక దృఢత్వం కోల్పోయి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా ఉదయాన్నే తీసుకుని ఆహారం మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా చురుగ్గా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఉదయం అల్పాహారంలో అత్యధిక ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం.
ప్రతిరోజు ఉదయాన్నే నవధాన్యాలను మొలక కట్టి ఆహారంగా తీసుకుంటే వీటిల్లో సమృద్ధిగా లభించే ప్రోటీన్స్, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ మీలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ప్రతిరోజు మీ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డు నీ ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డులో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ విటమిన్ ఏ, కాల్షియం ,ఐరన్ వంటి సహజ పోషకాలతో పాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి అమైనో ఆమ్లాలు సమృద్ధిగా లభిస్తాయి.
కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ఆహారంగా తినడం అలవాటు ఉంటుంది. అయితే నార్మల్ బ్రెడ్ కంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ తింటే ఎన్నో లాభాలు ఉంటాయని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. నార్మల్ బ్రెడ్ కంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్లో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కార్బోహైడ్రేట్స్ లభ్యమవుతాయి కాబట్టి రోజంతా మిమ్మల్ని అలసిపోనివ్వకుండా ఉంచడంలో సహాయపడతాయి
అత్యధిక ప్రోటీన్స్, ఒబేగా ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా కలిగిన అవిసె గింజల పొడిని అల్పాహారంలో ఉదయాన్నే తీసుకుంటే మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా మెదడు చురుకుదనాన్ని పెంచి రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.