తెల్ల మిరియాలతో ఇలా చేస్తే ఉబకాయం, క్యాన్సర్, రక్తపోటు సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు తెలుసా?

సాధారణంగా మనందరం సుగంధద్రవ్యాల్లో ఒకటైన నల్ల మిరియాలనే ఎక్కువగా చూసి ఉంటాం. అయితే వీటిల్లో తెల్ల మిరియాలు కూడా ఉంటాయి. తెల్ల మిరియాలను బాగా పక్వానికి వచ్చిన పెప్పర్ బెర్రీ నుంచి సేకరిస్తారు.వీటిని ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు కావున చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తెల్ల మిరియాలు మరియు నల్ల మిరియాల్లో దాదాపు ఒకే విధమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తెల్ల మిరియాల్లో విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం, ఫైబర్, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

తెల్ల మిరియాల పొడిని వేయించిన బియ్యంతోపాటు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండడంతో సీజనల్గా వచ్చే అనేక బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి తగిన వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంపొందిస్తుంది.తెల్ల మిరియాలు మన శరీరంలో వేడిని కలిగించి క్యాప్సైసిన్ కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా అతి బరువు సమస్యతో బాధపడేవారు త్వరగా శరీర బరువు తగ్గి ఉబకాయ సమస్యకు స్వస్తి పలకవచ్చు.

రక్తపోటు సమస్యతో బాధపడేవారు తరచూ తెల్ల మిరియాల పొడిని ఆహారంలో వినియోగిస్తూ వీటిలో ఉండే అత్యధిక పొటాషియం, కాపర్, శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్ రక్తనాళాల్లో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తొలగించి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది. మరియు గుండె ధమనులు సిరల్లో పేరుకుపోయిన చేరు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది. క్యాప్సైసిన్ కంటెంట్ శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.ముఖ్యంగా ఉదర క్యాన్సర్, లివర్ క్యాన్సర్ , పెద్ద పేగు క్యాన్సర్లను అదుపు చేయడంలో ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది.