ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని షుగర్ సమస్య వేధిస్తోంది. ఒకసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మధుమేహం కేసులు పెరుగుతున్న దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. జీవన శైలి, వ్యాయామ లోపం వల్ల ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
శీతల పానీయాలు తినడం లేదా తాగడం, పాలతో తయారయ్యే పదార్థాలు, బెల్లం, పెరుగు, బేకరీ, పులిసిపోయిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధ పడేవాళ్లను ప్రధానంగా నీరసం, విపరీతమైన దాహం, అతిమూత్రం లాంటి సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. బార్లీ, గోధుమలు, పెసలు, సెనగలు, నేరేడు, ఉసిరి, పసుపు, తేనె, గోమూత్రం, ఆవాలతో పాటు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల పాటు గ్యాప్ ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పవచ్చు. ఫలిత్రికాది కషాయం, చంద్రప్రభావతి, వసంత కుసుమాకుర రసం, సువర్ణరాజవంగేశ్వరం తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. టైప్2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లలో తిమ్మిర్లు, మంటలు, పొడి నోరు, నోటిలో తీపి రుచి సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉసిరి, కాకర, దాల్చిన చెక్క, కలబంద తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించడం ద్వారా మధుమేహం వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. బరువు, కొలెస్ట్రాల, కిడ్నీల సమస్యలు రాకుండా చూసుకుంటే డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ తగ్గుతుంది.