మన శరీరంలో విటమిన్ D లోపం వల్ల కలిగే నష్టాలు… సవరించుకునే మార్గాలు…

మన ఎముకల పెరుగుదలకు, ధృవత్వానికి సహాయపడే విటమిన్ D సూర్య రష్మి నుంచి సహజ సిద్ధంగా,అతి చౌకగా మన శరీరానికి అందుతుంది. అయితే ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్స్ కంప్యూటర్స్ అంటిపెట్టుకొని ఏసీ గదులకే అంకితం కావడం వల్ల మన శరీరానికి తగిన పరిమాణంలో మినిమమ్ డి అందక అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు
15 శాతం జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అంచనా వేస్తోంది. ఒక మనిషికి రోజుకు 600-800 iu విటమిన్‌ డీ సరిపోతుందని యూఎస్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌ వెల్లడించింది.

విటమిన్-డి లోపం వల్ల ఎముకల పెరుగుదల ఆగిపోయి దృఢత్వాన్ని కోల్పోతాయి. దాంతో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, ఎముక క్యాన్సర్, ఆస్థియోఫోరోసిస్ వంటి వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. అలాగే కండరాల పెరుగుదలలో లోపం ఏర్పడి నీరసం ,అలసట, కండరాలు పట్టేయడం, శారీరక మానసిక ఎదుగుదల లోపం వంటి సమస్యలతో తీవ్ర సతమతం అవ్వాల్సి ఉంటుంది.

మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సమృద్ధిగా లభించాలంటే ఉదయం అరగంట మన శరీరానికి సూర్యరశ్మి తగిలేలా కూర్చోవాలి. లేదా కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం ,నడక , యోగా వంటివి చేయాలి. అలాగే విటమిన్ డి సమృద్ధిగా లభించే పాలు, గుడ్లు ,సముద్రపు చేపలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారాన్ని తీసుకుంటే విటమిన్ డి లోపాన్ని సరి చేసుకోవచ్చు.