జస్ట్ టేస్ట్..! హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ‘టీ’

‘అరె.. చాయ్ చటుక్కున తాగరా భాయ్..!’ అని చిరంజీవి టీ గొప్పదనం, శరీరానికి ఇచ్చే ఉల్లాసం, టీ లో ఉన్న రకాల గురించి స్వయంగా పాడిన పాట అందరికీ తెలిసిందే. మరి.. అటువంటి టీ వర్షాకాలం, చలికాలంలో ఓకే. కానీ.. ఇప్పుడు హాట్ హాట్ సమ్మర్ వచ్చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువే ఉన్నాయి. ఎండ వేడి శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఒంటికి చల్లదనం కావాలి. ఇందుకు కూల్ డ్రింక్స్, జ్యూస్, కొబ్బరినీళ్లు తాగాలి. అలా అని రోజువారీ ఉపశమనం ఇచ్చే టీ తాగకుండా ఉండలేం.. చేసే పనిలో శ్రద్ధ చూపలేం. కానీ.. టీ తాగి కూడా శరీరానికి చల్లదనం అందిచొచ్చని అంటున్నారు నిపుణులు. కోల్డ్ కాఫీ తరహాలో కోల్డ్ టీ తాగమంటున్నారు నిపుణులు.

కోల్డ్ టీ ఇచ్చే టేస్టే వేరు అంటున్నారు. మండే వేసవిలో ఆరోగ్యంతోపాటు మనసుకి ఉల్లాసాన్ని కూడా ఇస్తుందని అంటున్నారు ఈ కోల్డ్ టీ తయారీదారులు. ఇందులో కెఫైన్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. శరీరానికి అందించే శక్తి మాత్రం ఎక్కువ అంటున్నారు. ఈ కోల్డ్ టీ తయారీ కూడా సులువుగానే చేయొచ్చని చెప్తున్నారు. మార్కెట్ లో లభ్యమయ్యే ‘కోల్డ్ బ్రూ టీ’ ఆకులు తీసుకోవాలి. నీటిలో వేసి 6 నుంచి 12 గంటల వరకూ నీటిలోనే ఉంచాలి. ఇదే మనకు చక్కటి కోల్డ్ టీ తాగేందుకు దోహదపడుతుందని అంటున్నారు.

కర్మ కెటిల్ కో ఫౌండర్ ధీరజ్ అరోరా మాటల్లో చెప్పాలంటే.. కోల్డ్ బ్రూ టీలో వేడి నీటిని వాడే అవసరం లేదు. దీనివల్ల ఆస్ట్రింజెన్సీ, చేదు కూడా తక్కువగానే ఉంటుంది. వేడి టీల కంటే ఇందులో కెఫిన్ తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. గది ఉష్ణోగ్రత నీటితో టీకి రుచిని ఇస్తూ యాంటీ ఆక్సిడెంట్ ను కాపాడుతుంది. దీంతో ఈ కోల్డ్ టీ రుచి అధికంగా ఉంటుంది. భారత్ లో ఈ కోల్డ్ టీ.. పుదీనా, బెర్రీ, లెమన్.. ఫ్లేవర్స్ లో లభ్యమవుతుంది. పుదీనా గ్రీన్ టీ, చమోమిలే, లెమోన్గ్రాస్ హెర్బల్ టీలు కూడా వేసవిలో శరీరానికి ఉల్లాసాన్నిస్తాయని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. హాట్ హాట్ సమ్మర్ లో ఈ కూల్ కూల్ టీ ను ట్రై చేసేయండి..!