అరుదుగా లభించే ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే బేరి పండ్లు ఏడాదిలో ఒక్క సీజన్లో మాత్రమే అరుదుగా లభిస్తాయి. ముఖ్యంగా బేరి పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ b6,
ఫైబర్,రిబోఫ్లావిన్ , ఐరన్,కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్ , యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. తరచూ బేరి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బేరి పండులో అత్యధిక నీటి శాతం అత్యల్ప కొవ్వు నిల్వలు కలిగి ఉండడం వల్ల మన శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడడమే కాకుండా మన శరీర బరువును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది. బేరి పండ్లలో అత్యధికంగా ఫైబర్ అత్యల్పంగా కొవ్వు గుణాలు కలిగి ఉండడం వల్ల శరీర బరువును తగ్గించుకోవాలనుకున్నవారు రోజువారి డైట్ నిక్షేపంగా తీసుకోవచ్చు.

బేరి పండు లో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. మరియు ఇందులో ఉండే అత్యధిక కార్బోహైడ్రేట్లు మన శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి అలసట నీరసం వంటి లక్షణాలను తొలగిస్తుంది.

బేరి పండులో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ మైక్రోబియన్ గుణాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరియు క్యాన్సర్ గణాల నియంత్రణలో సహాయపడి అన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలనుంచి మనల్ని రక్షిస్తుంది. ఇందులో అత్యధికంగా లభించే ఐరన్, ఫోలిక్ ఆమ్లం హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యలు తరిమికొడుతుంది.