ఈ పూల కషాయాన్ని సేవిస్తే ఆశ్చర్యపరిచే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

దానిమ్మ పండు లో ఉండే ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన అందరికీ తెలిసినవే. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దానిమ్మ పండు లోనే కాదు దానిమ్మ ఆకులు, బెరడు పువ్వుల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో తోడ్పడుతాయని చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా దానిమ్మ పువ్వుల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దానిమ్మ పూలల్లో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషక పదార్థాలతోపాటు సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందువల్ల ప్రతిరోజు ఈ పూల కషాయాన్ని సేవిస్తే
మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.మరియు శరీర బరువు నియంత్రించడంలో సహాయపడి ఉబకాయం, స్థూలకాయ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ పూల కషాయాన్ని సేవిస్తే మహిళల్లో తలెత్తే ఎన్నో అనారోగ్య సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం చూపుతుంది. డయాబెటిస్ వ్యాధిని అదుపు చేసే అద్భుత ఔషధ గుణాలు దానిమ్మ పూలల్లో ఉన్నందువల్ల దీనీ కషాయాన్ని సేవిస్తే డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.

దానమ్మ పూలను చూర్ణంగా చేసి అందులో తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం కొన్ని రోజులపాటు తింటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. దానిమ్మ పువ్వులను నీడన అరబెట్టి పొడిగా తయారు చేసుకొని అందులో తేనె కలుపుకొని సేవిస్తే శరీరంలో ఎముకలు కండరాలు దృఢంగా బలిష్టంగా తయారవుతాయి.ఆకలి మందగించి బలహీనంగా ఉన్నవారు దానిమ్మ పూలల్లో తాటి బెల్లం కలిపి బాగా మరిగించిన తర్వాత కషాయాన్ని సేవిస్తే అజీర్తి , మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తొలగి ఆకలి పెరుగుతుంది. దానిమ్మ పూలలో ఉండే పొటాషియం, సహజ యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.