Chicken: చికెన్ తింటున్నారా.. మంచిదే..! కానీ..

Chicken: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని పరిణామం ఇది. రోజువారీ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ టైమ్ లో బలం కోసం చికెన్ ఎక్కువగానే తింటున్నారు.. ప్రతిరోజూ కూడా తింటున్నారు. అయితే.. ఇలా ఎక్కవగా చికెన్ తినొచ్చా.. లేదా అనేది కూడా సందిగ్దంలో పడేసే విషయమే. అయితే.. ప్రొటీన్స్ అందించే చికెన్ తినడం చాలా మంచిది. కానీ.. రోజు తినడం మంచిది కాదని.. వారానికి ర రెండు లేదా మూడుసార్లు తినడం మంచిదంటున్నారు నిపుణులు. చికెన్ లో ఫ్యాట్ కూడా తక్కువే.

నిపుణుల లెక్క ప్రకారం చికెన్ తినాలంటే ఒకరోజులో 50 గ్రాములకు మించి తినకూడదు. మొత్తంగా వారానికి 350 గ్రాములు మించి తినకపోవడం ఉత్తమం. ఎందుకంటే.. ఎక్కువగా తింటే చికెన్ అందించే ప్రొటీన్ శరీరంలో ఫ్యాట్ గా మారిపోతుంది. ఇది మన బరువును, బ్లడ్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది అంత శ్రేయస్కరం కాదు. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చికెన్ తక్కువగా తింటే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. ఎక్కువగా తింటే ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతారు.

చికెన్ కొనేటప్పుడు కూడా ఫ్రెష్ గా ఉండేది తీసుకోవాలి. నిల్వ ఉంచిన చికెన్ కొని తిన్నా.. నిల్వ ఉంచిన చికెన్ తిన్నా ప్రమాదమే. చికెన్ ఎంత ఫ్రెష్ అయినా ఎక్కువగా ఉడికించి తినాలి. అందులో ఉండే ‘సాల్మొనెల్లా’ అనే చెడు బ్యాక్టీరియా ఉంటుంది. అందేరే ఎక్కువసేపు ఉడకించి తినాలి. ఈమధ్య కోళ్లు త్వరగా పెరగడానికి, బలిష్టంగా తయారవడానికి యాంటిబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారనే వాదనా ఉంది. దీంతో అవి ఎదుగుదలకు వచ్చ సమయం కంటే 10-15 రోజుల ముందే చికెన్ అయిపోతోంది.

అవి మనకు మంచివి కావు. అందుకే చికెన్ మంచిదే అయినా.. తక్కువగా తినాలి. చికెన్ ను ఎన్ని రకాలుగా తిన్నా ఆ టేస్ట్ అమోఘం. బిర్యానీలోకి మాత్రమే కాదు.. రోటీ, చపాతిలోకి చికెన్ చక్కగా సెట్ అవుతుంది. అందుకే శరీరానికి ప్రోటీన్స్ అందించే క్రమంలో కేవలం చికెన్ మీద మాత్రమే కాకుండా బాదం, గుడ్లు, చేపలు, పప్పులు, గింజలు.. వంటివి కూడా తినడం మేలు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.