తరుముకొస్తున్న తట్టు… పిల్లలలో ఈ లక్షణాలు కనబడితే తస్మాత్ జాగ్రత్త!

పిల్లలలో మీజిల్స్ వ్యాధి తరచూ వారిని వెంటాడుతూ ఉంటుంది అయితే టీకాల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టారు. అయితే కోవిడ్ సమయంలో పిల్లలలో మీజిల్స్ వ్యాక్సిన్ విషయంలో కాస్త ఆశ్రద్ధ వహించడంతో మీజిల్స్ వ్యాధి బారిన పడే పిల్లల సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఈ క్రమంలోనే మరోసారి అన్ని దేశాల ప్రభుత్వాలు పిల్లల విషయంలో అప్రమత్తం అయ్యారు. అయితే పిల్లలలో కనుక ఈ లక్షణాలు కనబడితే ఏమాత్రం ఆ శ్రద్ధ చూపకుండా వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.

మీజిల్స్ అనేది ఒక అంటూ వ్యాధి. ఇది పారామైక్సో వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఎవరైతే ఈ తట్టు వ్యాధితో బాధపడుతుంటారో అలాంటి వారు దగ్గినా తుమ్మిన ఈ వైరస్ గాలిలో వ్యాప్తి చెంది చాలా సులభంగా ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ వ్యాధితో బాధపడే వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయానికి వస్తే… ఎవరైతే తట్టు వ్యాధితో బాధపడుతుంటారు అలాంటి వారిలో తరుచూ జ్వరం, జలుబు దగ్గు కడుపులో మంట కళ్ళ నుంచి నీళ్లు కారడం, చర్మం పై ఎర్రటి దద్దులు ఏర్పడడం వంటి లక్షణాలు ఉంటాయి.

జ్వరంతో బాధపడుతున్న నాలుగు నుంచి ఐదు రోజులలో చర్మంపై ఏర్పడిన మచ్చలు నల్లటి పొక్కులుగా మారిపోతాయి. కొన్నిసార్లు నోట్లో కూడా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.ఇలాంటి లక్షణాలు అన్ని చిన్నపిల్లలలో ఎంతో అసౌకర్యానికి గురి చేస్తుంటే ముఖ్యంగా డిహైడ్రేషన్ బారిన పడతారు. అందుకే తరచూ ఈ వ్యాధితో బాధపడే పిల్లలకు కొబ్బరి నీళ్లు, పలుచని మజ్జిగ తరచూ ఇవ్వడం మంచిది.ఈ వ్యాధితో బాధపడేవారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రత కూడా పాటించడం ఎంతో ముఖ్యం. ఇక రోగ నిరోధక శక్తిని పెంపొందించే పండ్లు ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.