Chandipura Virus: చాండీపురా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కలకలం సృష్టిస్తుంది గుజరాత్లో బయటపడిన ఈ వైరస్ రోజురోజుకు మరింత వ్యాప్తి చెందుతూ 15 సంవత్సరాల వయసు గల చిన్నారులను బలి తీసుకుంటుంది. ఇప్పటికే పలు మరణాలు సంభవించాయి కరోనా తర్వాత ఈ వైరస్ ప్రజలలో తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో మరణం కూడా సంభవించడంతో ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ లేదు తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చాండీపురా వైరస్ అనేది ఈగలు దోమలు కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు. చండీపురా అనేది RNA వైరస్, ఆడ ఫ్లోబోటోమైన్ ఫ్లైస్ ద్వారా వ్యాపిస్తుంది. దోమలు కూడా ఈ వైరస్ వాహకాలు కావచ్చు. దోమ కాటు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతాయి.
చండీపురా వైరస్‌ను నివారించడానికి పిల్లలను ఈగలు, దోమల నుండి దూరంగా ఉంచాలి. బయట ఆడుకోవడానికి వెళుతున్నప్పుడు వారికి చేతులు, కాళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా దుస్తులను వేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడమే నివారణ అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో దోమలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ భయంకరమైన ప్రాణాంతకరమైన వైరస్ నుంచి పిల్లలను కాపాడవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.