విటమిన్ డి తో డయాబెటిస్ వ్యాధిని నియంత్రించవచ్చా? ఇందులో నిజం ఎంతో..!!

యావత్ ప్రపంచాన్ని చాపకింద నీరుల కబళిస్తోంది డయాబెటిస్ వ్యాధి. దీన్ని చక్కర వ్యాధి, షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా పిలుస్తుంటారు. డయాబెటిస్ వ్యాధి తలెత్తడానికి ముఖ్య కారణాలను పరిశీలిస్తే జీవన విధానంలో క్రమబద్ధతిలేని ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, జన్యు సంబంధమైన కారణాలను ప్రధానంగా చెప్పొచ్చు. కారణాలు ఏవైనా షుగర్ వ్యాధి బారిన ఒకసారి పడితే పూర్తిగా నయం చేసుకోవడం సాధ్యం కాదు నియంత్రించుకోవడం ఒక్కటే మార్గం అని చెబుతుంటారు.

 

అయితే తాజా అధ్యయనాల ప్రకారం సహజ సిద్ధంగా సూర్య రశ్మి ద్వారా లభించే విటమిన్ డి తో డయాబెటిస్ వ్యాధిని అదుపులో పెట్టవచ్చునని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొందరు పరిశోధకులు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై గత మూడు సంవత్సరాలుగా విటమిన్ డి సప్లిమెంట్లరి ప్రభావాన్ని పరిశీలించగా ఆశ్చర్యకరంగా మూడేళ్ల తర్వాత 15 శాతం మేర డయాబెటిస్ వ్యాధి ప్రభావం తగ్గిందని తెలుస్తోంది. అంటే ప్రమాదకర

డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాలంటే కేవలం డి విటమిన్ శరీరానికి సరిగా అందిస్తే చాలు. సహజ సిద్ధంగా దొరికే సూర్యరశ్మిని శరీరానికి తాకేలా చూసుకుంటే ఇక డయాబెటిస్ వ్యాధి దూరమైనట్లే.

 

సాధారణంగా సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకినపుడు శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అలాగే పాలు, గుడ్లు, చేపలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు కొన్ని రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరల్లో కూడా సమృద్ధిగా విటమిన్ డి లభిస్తుంది. కావున మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సమృద్ధిగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి టైప్ 2 డయాబెటిస్ వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొవ్వు పదార్థాలను కరిగించి జీవక్రియలను నియంత్రిస్తుంది.