కూల్ డ్రింక్స్ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. క్యాన్సర్ తో పాటు ఆ సమస్యలు వస్తాయట!

మనలో చాలామంది కూల్ డ్రింక్స్ ను ఎంతో ఇష్టంగా తాగుతారు. కూల్ డ్రింక్స్ ఖరీదు తక్కువే అయినా వాటిని తాగడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. కూల్ డ్రింక్స్ తాత్కాలికంగా రుచిగా అనిపించినా దీర్ఘకాలంలో కూల్ డ్రింక్స్ వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇప్పటివరకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉన్నవాళ్లు సైతం ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూల్ డ్రింక్స్ లో కృత్తిమ తీపి కోసం ఉపయోగించే పదార్థాల వల్ల అస్పర్టెమ్‌ అనే తీపి కోసం ఉపయోగించే పదార్థం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగే అవకాశం ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్యాన్సర్ బారిన పడితే దీర్ఘకాలంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది.

కోకా-కోలా, డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ ఇతర కూల్ డ్రింక్స్ సంస్థలు అస్పర్టెమ్ ను వినియోగిస్తున్నాయని తెలుస్తోంది. అమైనో ఆమ్లాలతో తయారు చేసే ఈ స్వీటెనర్ ప్రాణాలకు అపాయం కలిగిస్తుంది కాబట్టి ఈ స్వీటెనర్ కు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఇందులో మిథనాల్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగిస్తున్నారు.

కూల్ డ్రింక్స్ సంస్థలు ఇకైనా ఈ ప్రమాదకరమైన అస్పర్టెమ్ ను కూల్ డ్రింక్స్ లో కలపకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. చూయింగ్ గమ్, తక్కువ కేలరీల పండ్ల రసాలు, డైట్ సోడాలు తాగేవాళ్లు కూడా తగిన జాగ్రత్త వహిస్తే మంచిది. ప్రమాదకరమైన కెమికల్స్ తో ఉన్న కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చెప్పవచ్చు.