చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రోజ్ వాటర్ వాడుతున్నారా… ఈ విషయాలు తెలుసుకోండి!

సాధారణంగా మన సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మార్కెట్లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు ఇలా వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని భావిస్తుంటారు అయితే మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో రోజు వాటర్ కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా రోజ్ వాటర్ ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు తద్వారా ఎన్నో రకాల లాభాలను కూడా పొందవచ్చు. గులాబీ పూల మిశ్రమాన్ని ప్రముఖ బ్యూటీ కాస్మోటిక్స్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గులాబీ పూలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి రోజ్ వాటర్ తయారు చేస్తున్నారు.

రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని టోనర్లోనో, మిస్టలోనూ, మరెన్నో కాస్మెటిక్స్ లో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. చర్మ సంరక్షణలో గులాబీ నీళ్లను (రోజ్ వాటర్) ను ఉపయోగిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మంపై ఏర్పడే రంధ్రాలను, మచ్చలను, ముడతలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రోజ్ వాటర్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు
యాక్నె తొలగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. – గులాబీ నీరు సంగ్రహాల కారణంగా మీ చర్మంపై ఉండే రెడ్ నెస్ ఇంకా ఇరిటేషన్ తగ్గు ముఖం పడతాయి.

జిడ్డు చర్మ సమస్యతో బాధపడేవారు ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిలో రెండు లేదా మూడు టీస్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సున్నితంగా వృత్తాకార కదలికలతో మీ ముఖాన్ని మసాజ్ చేస్తూ సమానంగా విస్తరించండి. ముల్తాను మట్టి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొహం ఎంతో తాజాగా కాంతివంతంగా మెరుస్తుంటుంది అలాగే మనం ఏదైనా కార్యక్రమాలకు వెళ్లే సమయంలో మేకప్ వేసుకోవడానికి ముందు తిరిగి వచ్చిన తర్వాత మేకప్ తొలగించిన అనంతరం రోజ్ వాటర్ తో మొహం మొత్తం శుభ్రం చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి చర్మ సమస్యలు రాకుండా మన ముఖం ఎంతో ఆరోగ్యవంతంగాను సౌందర్యంగాను మెరుస్తూ ఉంటుంది.