మనలో చాలామందిని ఎన్నో అరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందం విషయంలో మరీ ముఖ్యంగా పాదాల విషయంలో తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలనే సంగతి తెలిసిందే. పాదాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాదాలు నల్లగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా పాదాలకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.
నిమ్మకాయ సహాయంతో నల్లటి పాదాలను సులభంగా తెల్లగా మార్చుకోవచ్చు. డెడ్ స్కిన్ తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. శెనగపిండిని పసుపుతో కలిపి, పెరుగు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకుని పాదాలకు అప్లై చేయడం ద్వారా టాన్ దూరమవుతుంది. గోరువెచ్చని నూనెతో పాదాలకు మాయిశ్చరైజ్ చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు.
గోరువెచ్చని లేదా హాట్ ఆయిల్ మసాజ్ వాడటం ద్వారా పాదాలు తెల్లగా మారే అవకాశం అయితే ఉంటుంది. కోకోనట్ వాటర్ తో పాదాలను శుభ్రపరచడం ద్వారా నల్లగా మారిన పాదాలను సహజంగా తెల్లగా మార్చుకోవచ్చు. పాలపొడి వాడటం ద్వారా పాదాలపై మట్టి, మురికి సమస్యలు దూరమవుతాయి. ఎండిన నారింజ తొక్కల పొడికి కొంచెం ముల్తానీ మట్టి యాడ్ చేసి కాళ్లు శుభ్రం చేస్తే మంచిది.
కీరదోస రసం సహాయంతో పాదాల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే కీరదోస రసం పాదాల చర్మం తెల్లగా, ఆరోగ్యంగా మారేలా చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. రెండు చెంచాల చొప్పున సెనగపిండి, నీళ్లూ, అరచెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి రాయడం వల్ల పాదాలు తెల్లబడే అవకాశాలు అయితే ఉంటాయి.