ఆరోగ్యానికి మంచిదని విటమిన్ డి అధికంగా తీసుకుంటున్నారా.. ఈ ప్రమాదంలో పడినట్లే?

సాధారణంగా మన శరీర అవసరానికి మించి మనం ఏది తీసుకున్న అది వికారమే అవుతుంది. అలా అవసరానికి మించి ఆహార పదార్థాలను తీసుకుంటా లేదా మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ తీసుకున్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్స్ ఎంతో అవసరం అనే విషయం మనకు తెలిసిందే అయితే విటమిన్స్ అవసరం కదా అని అధిక మోతాదులు తీసుకున్న ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా విటమిన్ డి విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలుసుకుందాం….

విటమిన్ డి ను ఆహార పదార్థాల ద్వారా కాకుండా చాలామంది సప్లిమెంటరీ రూపంలో తీసుకోవటం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి అందుకే డాక్టర్ల సలహా సూచనల మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం ఎంతో మంచిది.పరిమితికి మించి విటమిన్ డి తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంట్ అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి మందగిస్తుంది అందుకే సప్లిమెంటరీ రూపంలో కాకుండా ప్రతిరోజు ఉదయం సూర్యుడి నుంచి నుంచి వెలువడే విటమిన్ డి ని పొందడం ఎంతో మంచిది.

విటమిన్ డి సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంపై ప్రభావం చూపుతుంది తద్వారా జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్ధక సమస్య కూడా తలెత్తుతుంది.అందుకే విటమిన్ డి ఎక్కువగా సూర్యరష్మి నుంచి అలాగే సహజ సిద్ధంగా ఆహార పదార్థాల నుంచి తీసుకోవాలి కానీ సప్లిమెంటరీ రూపంలో తీసుకోకూడదు అది కూడా మన శరీరానికి సరిపడా మోతాదులో మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.