బ్రౌన్ రైస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తమ రోజువారి ఆహారంలో వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ ను ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. అసలు బ్రౌన్ రైస్ అంటే ఏమిటి వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఎందుకు మన ఆరోగ్యానికి మంచిది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పాలిష్ పట్టని ముడి బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. బియ్యపు గింజల్ని తెల్లగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎక్కువగా పాలిష్ చేస్తే బియ్యం పై పొరలో సమృద్ధిగా ఉండే ఫైబర్, ప్రోటీన్స్, పాలీ ఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు,విటమన్ బీ, వంటి పోషకాలు లోపిస్తాయి. అందుకే మన ఆరోగ్యాన్ని రక్షించడంలో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మంచిదని చెప్పొచ్చు.

బ్రౌన్ రైస్ లో 1.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అదే వైట్ రైస్ లో అయితే కేవలం 0.2 గ్రాములు మాత్రమే లభిస్తుంది. రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది. కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న ఫైబర్, పాలీఫెనాల్ వంటి పోషకాలు కార్బోహైడ్రేట్స్ ను అదుపు చేసి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.

వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో అత్యధికంగా ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఫైబర్, మాంగనీసు జీర్ణ క్రియ రేటును మెరుగుపరిచి మలబద్ధకం,గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తొలగిస్తుంది.
బ్రౌన్ రైస్ లోని మెగ్నీషియం, సెలీనియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.