వర్షాల వల్ల జుట్టు రాలుతోందా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అసలు చిట్కాలు ఇవే!

కాలం మారిన ప్రతి సందర్భంలో ఆరోగ్య సమస్యలు వేధించడం సాధారణం అనే సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో చర్మం, జుట్టు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ర్యాషెస్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మం పొడిబారడం వల్ల కొన్నిసార్లు వేర్వేరు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

జుట్టు రాలే సమస్యతో బాధ పడేవాళ్లు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. సీడ్స్, నట్స్ తీసుకోవడం ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సీడ్స్, నట్స్ తీసుకోవడం ద్వారా జింక్, విటమిన్ ఇ లభించడంతో పాటు జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ లభిస్తుంది.

గ్రీక్ పెరుగు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో గ్రీక్ పెరుగు ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. క్యారెట్లలో బీటా- కెరోటిన్ పుష్కలంగా ఉండగా స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో క్యారెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు.

నిస్తేజమైన జుట్టు కుదుళ్లను ప్రేరేపించడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఇవి సహాయపడతాయి. స్ట్రాబెర్రీలలో అధిక స్ఠాయిలో సిలికా ఉండగా స్ట్రాబెర్రీలు తింటూ ఉంటే జుట్టు రాలడం ఆగడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓట్స్ లో ఉండే ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని చెప్పవచ్చు.

కాయధాన్యాలు, ప్రోటీన్, జింక్, ఐరన్, బయోటిన్ పుష్కలంగా ఉన్న పప్పులు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పప్పులు తీసుకోవడం ద్వారా జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్ బి, విటమిన్ సి లభించే అవకాశాలు అయితే ఉంటాయి.