నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడటం జరుగుతుంది. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యాన్ని కల్పిస్తాయని చెప్పవచ్చు. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి నెలకొంటుంది. నోటిపుండ్లు ఎలాంటి హాని కలిగించకపోయినా వీటి వల్ల నోటికి కొంచెం కారం, పులుపు తగిలినా చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. నోటి శుభ్రత పాటించకపోవడం, మలబద్ధకం, హార్మోన్‌లలో మార్పులు, ఎసిడిటీ, విటమిన్ బి, సి, ఐరన్, ఇతర పోషకాల లోపాల వల్ల నోటి పుండ్లు ఏర్పడతాయని చెప్పవచ్చు. మహిళల్లో, యువతలో నోటిపుండ్లు ఎక్కువగా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. మౌత్ అల్సర్లకు హోం రెమిడీస్ కంటే మెరుగైన చికిత్స లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండగా నోటి పుండ్లతో బాధపడుతున్నవారు కొద్దిగా తేనెను తీసుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో రాసుకుంటే మంచిది. ఆమ్లా పౌడర్ (ఉసిరికాయతో చేసిన పొడి) కాస్త కలుపుకుని నోటి పూతపై రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. చిటికెడు పసుపులో తేనెను కలిపి నోటిపుండ్లపై రాసుకున్నా మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది.
ములేతి పౌడర్‌ను చాలాకాలంగా ఆయుర్వేదంలో చాలా ఔషధ గుణాలకు వినియోగిస్తుండగా వీటితో నోటి సమస్యలు దూరమవుతాయి. నోటిపుండ్ల వల్ల ఏర్పడే కడుపు రుగ్మతలకు ములేతి పౌడర్ దివ్యౌషధంగా పని చేస్తుందని చెప్పవచ్చు. నోటి అల్సర్లకు కారణమైన విషతుల్యాలను ములేతి పౌడర్ తొలగిస్తుంది. 1/2 టీస్పూన్ త్రిఫల చూర్ణాన్నిఒక కప్పు నీటితో కలిపి డికాషన్ తయారు చేసి నోటితో పుక్కిలిస్తే నోటి పుండ్లు మాయమవుతాయని చెప్పవచ్చు. పటికబెల్లం, కర్పూరం, కొబ్బరినూనె లేదా నెయ్యి, అలోవెరా జ్యూస్, తులసి ఆకుల సహాయంతో నోటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.