రోజులు ఎక్కువగా టీ తాగుతూ బ్రతుకుతున్నారా… ఈ సమస్యలు తప్పవు!

మనలో చాలామంది టీ లవర్స్ ఎక్కువగానే ఉంటారు.ఉదయాన్నే వేడి వేడి టీ తాగితే ఆ మజానే వేరు కదా! నిజానికి టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే టీలో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు కూడా ఉన్నాయి. అయితే సమస్య అంతా టీ ని ఎక్కువగా తాగడం లోనే ఉంది. ఒకరోజులో మోతాదుకు మించి టీ తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఒక రోజులు ఎన్ని కప్పులు టీ తాగాలి, మోతాదుకు మించి తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు రెండు కప్పుల టీ తాగితే మానసిక ఒత్తిడినీ తగ్గించి మనల్ని రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే నిపుణులు సూచించిన దాని ప్రకారం ఒక రోజులు రెండు నుంచి మూడు కప్పుల టీ నిక్షేపంగా తాగొచ్చు అది షుగర్ తక్కువగా వేసుకొని. అంతకుమించి అంటే ఐదు నుంచి ఆరు కప్పుల టీ తాగితే డయాబెటిస్, రక్తపోటు, ఫైల్స్, ఊబకాయం, గుండె జబ్బులు, మలబద్ధకం, ఎసిడిటీ, ప్రేగుల్లో పుండ్లు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రోజులు మోతాదుకు మించి టీ తాగితే అనారోగ్య సమస్య తలెత్తడానికి కారణం టీలో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎక్కువగా ఉంటుంది మరియు షుగర్ పరిమాణం కూడా ఎక్కువగానే వినియోగిస్తాం. టీ లో ఉండే కెవిన్ తక్కువ పరిమాణంలో తీసుకుంటే మనల్ని రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుంది మోతాదుకు మించి తీసుకుంటే మెదడు కణాలపై ప్రభావం చూపి నిద్రలేమి జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అలాగే టీ పానీయంలో షుగర్ ను ఎక్కువగా వినియోగిస్తాం కావున శరీరంలో షుగర్ లెవెల్స్ ఎక్కువైతే డయాబెటిస్, ఉబకాయం, ఫ్యాటీ లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కావున మీకు టీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటే తక్షణమే మానుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.