కొబ్బరి నీళ్లు మరియు పచ్చి కొబ్బరిలో మన శరీరానికి శక్తినిచ్చే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.అంతకంటే అధిక పోషకాలు కొబ్బరి పువ్వులో లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కొబ్బరికాయ మొలకెత్తినప్పుడు కొబ్బరికాయ లోపల తెల్లటి మెత్తటి పువ్వు వంటి పదార్థం ఏర్పడుతుంది దాన్ని కొబ్బరి పువ్వు అంటారు. ఒక మాటలో చెప్పాలంటే మొలకెత్తిన కొబ్బరికాయ అని చెప్పొచ్చు.
కొబ్బరి పువ్వు రుచికి తియ్యగా ఉండి ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. తరచు కొబ్బరి పువ్వును ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి పువ్వులో విటమిన్ సి, ఐరన్, రాగి, జింక్ సమృద్ధిగా ఉండి క్యాలరీలు, కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తనాళాల్లో, నడుము చుట్టూ పొట్ట భాగంలో అధికంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగించి మనల్ని నాజుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ,ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర కణాల సంఖ్యను పెంచుతుంది.
కొబ్బరి పువ్వు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొబ్బరి పువ్వును తరచూ తింటుంటే థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రణలో ఉంచుతుంది.కొబ్బరి పువ్వు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడి క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. మరియు శరీరంలో చెడు మలినాలను సమర్థవంతంగా తొలగించి కిడ్నీ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. కొబ్బరి పువ్వులో విటమిన్ ఏ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు తొలగి కంటి చూపును మెరుగుపరుస్తుంది.