సాధారణంగా పెరుగు లేనిదే మనం భోజనం పూర్తికాదు.ఇలా పెరుగుతో భోజనాన్ని పూర్తి చేస్తుంటారు చాలామందికి పెరుగు లేకుండా భోజనం చేయడం అసలు ఏమాత్రం ఇష్టం ఉండదు.అలాగే మరికొందరికి పెరుగు అంటే ఇష్టమని మితిమీరి పెరుగుతోనే తింటూ ఉంటారు. ఇలా ఎక్కువగా పెరుగును ఆహారం తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.పెరుగును రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలని అలాగే పెరుగు తీసుకోవడానికి సరైన సమయం మధ్యాహ్నం మాత్రమేనని చెప్పాలి. మరి పెరుగును అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయానికి వస్తే.
రోజుకు ఒక చిన్న కప్పు పెరుగు మాత్రమే తీసుకోవాలి అలా కాకుండా అంతకుమించి తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో అలాంటివారు పెరుగును అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.పెరుగులో లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్ అలర్జీ ఉన్నవాళ్లు పెరుగును తింటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లాక్టోస్ అనేది ఒక రకమైన మిల్క్ షుగర్. ఇది మన శరీరంలో ఉండే లాక్టేజ్ ఎంజైమ్ సహాయంతో జీర్ణమవుతుంది.
ఎవరైతే ఈ లాక్టోస్ ఎంజైమ్ లోపం ఉన్నప్పుడు లాక్టోస్ సులభంగా జీర్ణం కాదు. ఫలితంగా శరీరంలో ఉబ్బరం, గ్యాస్ సమస్య పెరగడం కూడా ప్రారంభమవుతుంది. ఇక పెరుగులో కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల మితిమీరి తీసుకోవడంతో అధిక శరీర బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెరుగులో సంతృప్త కొవ్వు, అధునాతన గ్లైకేషన్ ఉంటాయి. దీని కారణంగా మన ఎముకల సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మోకాళ్ల నొప్పి సమస్యలతో కూడా బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.ఇక చలికాలంలో కూడా పెరుగును ఎక్కువగా తినటం వల్ల ఎక్కువగా కఫం దగ్గు జలుబు వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది కనుక వాతావరణం చల్లగున్న సమయంలో పెరుగును కాస్త అవాయిడ్ చేయడమే మంచిది.