మన రోజువారి ఆహారంలో ఒక కప్పు పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతోపాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం,మెగ్నీషియం,జింక్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.అలాగే పెరుగులో మన శరీరానికి మేలు చేసే లాక్టోబాసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే బ్యాక్టీరియా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పెరుగును కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యతిరేక చర్య జరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అనేక పరిశోధనలు స్పష్టమైంది.
ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది అయితే పెరుగులో చక్కెరని కలుపుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ పద్ధతిని తక్షణమే మార్చుకోవాలి ఎందుకంటే పెరుగులో చక్కెర కలుపుకొని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడమే కాకుండా షుగర్ వ్యాధికి కారణం కావచ్చు. ఉల్లిపాయతో పెరుగును కలుపుకొని తినడం వల్ల సోరియాసిస్, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కారణం ఉల్లిపాయ శరీరంలో వేడిని పుట్టిస్తే పెరుగు చల్లదనానికి కారణం కావడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చేపలతో చేసిన వంటకాలను తిన్న తర్వాత వెంటనే పెరుగు తినడం అంత మంచిది కాదు.పెరుగు మరియు చేపల్లో కూడా అధిక ప్రోటీన్లు లభ్యమవుతాయి. కావున ఈ రెండిటినీ కలిపి తింటే జీర్ణం అవడంలో ఇబ్బంది తలెత్తి అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో అలర్జీ లక్షణాల వల్ల చర్మ సమస్యలు చర్మంపై మచ్చలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి చేపలను తిన్నప్పుడు పెరుగును పూర్తిగా తినకపోవడమే మంచిది. అరటిపండును, పెరుగుతో కలిపి తినకూడదు. ఈ రెండు కలిపి తినడం వల్ల కొంతమందిలో తీవ్ర కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పెరుగును తిన్న వెంటనే పాలను సేవిస్తే జీర్ణ వ్యవస్థలో వ్యత్యాసం ఏర్పడి ప్రమాదకర డయేరియా సమస్య తలెత్తవచ్చు. కాబట్టి పెరుగు తిన్నప్పుడు పైన సూచించిన పదార్థాలను తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా తినకుండా ఉండడం మంచిది.