Sourd Curd: పులిసిన పెరుగుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అవాక్కవుతారు!

Sourd Curd: ప్రతి రోజూ భోజనం తినే సమయంలో అందరికీ పెరుగన్నం తినే అలవాటు ఉంటుంది . భోజనం చివర్లో పెరుగు అన్నం తినకపోతే చాలామందికి భోజనం చేసిన తృప్తి ఉండదు. ప్రతి రోజు ఒక కప్పు పెరుగు లేదా పెరుగు కలిపిన అన్నం తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మినరల్స్, విటమిన్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొంచం పులిసిన పెరుగు తినటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

పులిసిన పెరుగు లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కప్పు పులిసిన పెరుగు తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. పెరుగులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి కేలరీల శాతం తక్కువగా ఉంటుంది. పెరుగులో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. తద్వారా శరీర బరువు తగ్గించవచ్చు.

ప్రతిరోజు క్రమం తప్పకుండా పెరుగు తినటం వల్ల బిపి సమస్యలు దరిచేరవు. బీపీ సమస్యతో బాధపడేవారు పెరుగు తినటం వల్ల వారి సమస్యను అదుపులో ఉంచవచ్చు. పెరుగులో ఉండే లాక్టోబసిల్లస్ అడిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ బ్యాక్టీరియా శరీరంలో పేరుకున్న చెడు కొవ్వు కరిగించి బయటికి పంపుతుంది. ప్రతిరోజు పులిసిన పెరుగు తినటం లేదా మజ్జిగ తాగటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.