వేడివేడి కాఫీ టీ తాగుతున్నారా… క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్నట్లే?

సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే ముందు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే మన రోజును ప్రారంభించము. ఇలా కాఫీ లేదా టీ వేడివేడిగా తాగిన తర్వాత మన రోజువారి కార్యక్రమాలను ప్రారంభిస్తాము అయితే ఇలా వేడి వేడి కాఫీ టీ తాగేవారు ఇది తెలుసుకోవాలండి. మీరు కనుక వేడివేడి కాఫీ టీ తాగుతున్నారు అంటే మీరు కాన్సర్ ప్రమాదం అంచులలో ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. 60 డిగ్రీలకు మించి మనం ఏదైనా పానీయాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మెడికల్ జర్నల్‌లో ఈ వారం ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి పానీయం టీ లేదా కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనీ తెలిపారు. ఇలా వేడి వేడి పానీయాలు తాగటం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90 శాతం పెరుగుతుంది.

కాఫీ టీ లేదా ఇతర వేడి పానీయాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయి. వేడి పానీయాలు తీసుకోవడం వల్ల నాలుక చుట్టూ చాలా సున్నితంగా ఉండే రుచి మొగ్గలు కూడా ప్రభావితమవుతాయి. వేడి పానీయాలకు గురైనప్పుడు అవి ఇతర కణాల మాదిరిగానే దెబ్బతింటాయి. పెదవులు మంట కలగడమే కాకుండా గుండెలో కూడా నొప్పిని కలిగిస్తుంది అందుకే వీలైనంతవరకు ఎక్కువ వేడి కలిగినటువంటి పానీయాలను కాకుండా కాస్త గోరువెచ్చగా తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.