మనం రోజు వంటలలో ఉపయోగించే అల్లంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విషయం మనకు తెలిసిందే. అయితే అల్లంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన శరీరంలో ఎన్నో రకాల వ్యాధులను తొలగిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ విధంగా అల్లం వంటలకు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ క్రమంలోనే కొందరు అల్లం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న ఉద్దేశంతో రోజు మోతాదుకు మించి అల్లం టీ తాగుతూ ఉంటారు.ఈ విధంగా అల్లం అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరి అల్లం టీ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయానికి వస్తే.. అల్లం అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో అదనపు యాసిడ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది.ఇక అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యకు కారణం కావడమే కాకుండా రక్తాన్ని పలుచగా మారుస్తుంది. అలాగే మధుమేహంతో బాధపడే వారు కూడా అల్లం పూర్తిగా తక్కువ స్థాయిలో తీసుకోవడం మంచిది. ఇక రాత్రిపూట అల్లం టీ తాగి పడుకోవడం వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడతారు.
గర్భిణీ స్త్రీలు అల్లం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. గర్భిణీ స్త్రీలు రోజుకు అరకప్పు మాత్రమే అల్లం టీ తీసుకోవాలి.అధిక మోతాదులో గర్భిణీ స్త్రీలు అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు కడుపులో నొప్పి కూడా తలెత్తి సూచనలు ఉన్నాయి. అందుకే వీలైనంతవరకు అల్లం తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఎంతో మంచిది. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మితిమీరిన అల్లం తీసుకోవడం వల్ల అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని నిపుణులు చెబుతున్నారు.