తరచూ గోర్లు కొరుకుతూ ఉన్నారా… ఈ సమస్యలు తప్పవంటున్న వైద్యులు!

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది వారు సంతోషంగా ఉన్న లేదా ఆందోళనగా ఉన్న చేతివేళ్లు నోట్లోకి పోయి తరచూ గోర్లు కొరుకుతూ ఉంటారు. ఇది చెడ్డ అలవాటని తెలిసినా కూడా ఇలా తరచూ గోర్లు కొరుకుతూ ఉంటారు.గోర్లను కొరికే వారికి దురదృష్టం వెంటాడుతుంది అని మన పెద్దవారు చెబుతున్నారు. అలా చెప్పడానికి కారణాలు లేకపోలేదు ఇలా తరచూ గోర్లు కొరకడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయం గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…..

మనం ఏ పని చేసిన మొదట తాగేది చేతి గోర్లే కాబట్టి గొర్ల సందుల్లో ప్రమాదకర సూక్ష్మజీవులు ఉండిపోతాయి. మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోకుండా చేతి గోర్లను కొరికితే మనలో వ్యాధిని కలగజేసే ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు సులువుగా మన నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనేక అనారోగ్య సమస్యలను కలగజేస్తాయి. అందుకే మన పెద్దవారు గోర్లను కొరికితే దురదృష్టం వెంటాడుతుంది అని చెబుతుంటారు.గొర్ల ద్వారా మన శరీరంలోకి సులువుగా ప్రవేశించే ప్రమాదకర సాల్మోనల్లటైపే ఈకొలిఅనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కావున గోర్లు కొరికే చెడు అలవాటును మానుకొని ఎప్పటికప్పుడు గోర్లు పెరిగిన వెంటనే కత్తిరించుకొని శుభ్రంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా చిన్నపిల్లలు మట్టిలో ఆడుకుంటూ చేతులు శుభ్రం చేసుకోకుండా అలాగే ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటుంటారు. మట్టిలో ఆడుకున్నప్పుడు గొర్ల సందుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ,వైరస్లు ఉండిపోయి పిల్లల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తాయి కావున పిల్లలకు క్రమం తప్పకుండా గోర్లు పెరిగిన వెంటనే నెయిల్ కట్టర్ తో కత్తిరించి శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి.తరచూ గోర్లు కొరుకుతూ ఉన్నారంటే భవిష్యత్తులో వీరికి
నోటి క్యాన్సర్, ఊదర క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్కసారి వాంతులు, విరోచనాలు, డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చు. గోర్లను కొరికే అలవాటు ఉన్నవారిలో చిగుళ్ల సమస్యలు, పంటి సమస్యలు, దవడ ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుక వీలైనంతవరకు ఈ అలవాటు నుంచి బయటపడటమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.