ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ డ్యామేజ్ అయినట్లే.. లివర్ సమస్యలకు చెక్ పెట్టే చిట్కాలివే!

మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటనే సంగతి తెలిసిందే. మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే విషయంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఉండే కెమికల్స్ ను రెగ్యులేట్ చేసే సమయంలో లివర్ పాత్ర అంతాఇంతా కాదు. అయితే లివర్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యల బారిన పడితే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంది. మద్యం అలవాటు లేకపోయినా కొంతమందిని లివర్ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.

ప్రతిరోజూ కూరగాయలు తీసుకోవడం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీ, ఆపిల్ సిడర్ వెనిగర్‌ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం త్వరగా దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఏ ఆర్ ఎల్ డి సమస్య సమస్య బారిన పడితే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు సైతం వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని లక్షణాలు కాలేయానికి సంబంధించిన వ్యాధులకు సంకేతాలుగా నిలుస్తాయి. విపరీతమైన అలసట, పాదాలు పొంగిపోవడం, బరువు తగ్గిపోవడం, పొత్తి కడుపు లో వాపు, విపరీతమైన దాహం, ఆకలి తగ్గిపోవడం, కళ్లు పసుపు రంగులోకి మారిపోవడం, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

కాలేయానికి హాని కలిగితే టైప్2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. లివర్ సమస్యలు ఉన్నవాళ్లు తరచుగా పరీక్షలు చేసుకుంటే మంచిది. 45 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు కచ్చితంగా మెడికల్ చెకప్ చేయించుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం దీర్ఘకాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.