తెల్ల మిరియాలు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా… తెలిస్తే తినకుండా ఉండలేరు!

మనం నిత్యం వంటింట్లో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాము. ఈ సుగంధ ద్రవ్యాలు వంటలకు రుచిని మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంటాయి. ఈ విధంగా సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలువబడే మిరియాలకు పురాతన ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సహజంగా నల్లమిరియాలు, తెల్ల మిరియాలు అని రెండు రకాలు ఉన్నాయి. రెండింటిలోనూ ఒకే విధమైన ఔషధ గుణాలు, పోషక విలువలు ఉన్నప్పటికీ వంటకాల్లో అధిక ప్రాముఖ్యత నల్ల మిరియాలకే ఇస్తా. తెల్ల మిరియాలను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.తెల్ల మిరియాలను సరైన పద్ధతుల్లో తరచూ మన ఆహారంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల మిరియాలను బాగా పక్వానికి వచ్చిన పెప్పర్ బెర్రీ నుంచి సేకరిస్తారు.తెల్ల మిరియాల్లో యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉండడంతో సీజనల్గా వచ్చే అనేక బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి తగిన వ్యాధి నిరోధక శక్తిని మనలో పెంపొందిస్తుంది.తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ పుష్కలంగా ఉంటుంది. క్యాప్సైసిన్ కంటెంట్ శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ను నయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది

తెల్ల మిరియాల్లో మన శరీర కణాల పెరుగుదలకు అవసరమైన విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం, ఫైబర్, ఐరన్, కాపర్, మాంగనీస్ మొదలైన మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున శరీర జీవక్రియలు సక్రమంగా జరుగునట్లు చేస్తుంది. తెల్ల మిరియాలు మన శరీరంలో వేడిని కలిగించి క్యాప్సైసిన్ కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. అతి బరువు సమస్యతో బాధపడేవారు త్వరగా బరువును తగ్గవచ్చు.ఇలా తెల్ల మిరియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేయవచ్చు.