దంత క్షయం, నోటి దుర్వాసన సమస్యకు ఆయుర్వేద అద్భుత పరిష్కార మార్గాలు!

ఈరోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు దంతాల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి గల కారణాలను పరిశీలిస్తే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోలేకపోవడం,
ఆహార నియమాలు పాటించకపోవడం, పాన్ ,గుట్కా మద్యపానం, ధూమపానం వంటి కారణాలతో మొదట చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రారంభమై దంతాలకు రక్షణ కవచంలా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని దంతక్షయం ఏర్పడుతుంది. ఈ సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగితే చిగుళ్లలో రక్తం, చిగుళ్ల వాపు ,నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తి నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఇప్పుడు చూద్దాం

మన ఇంటి పరిసరాల్లో సమృద్ధిగా లభించే ఉత్తరేణి మొక్కతో పంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా వాడే ఉత్తరేణి మొక్క కాడతో ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకులతో అనేక దంత సమస్యలను నయం చేయవచ్చు. జామ ఆకులలో యాంటీ ఫంగల్ ,యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల జామ ఆకు కషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కిలిస్తే నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.అలాగే చిగుళ్ల సమస్యను నోటి దుర్వాసనను, నోటి పూత వంటి సమస్యలను అరికడుతుంది.

పంటి నొప్పి సమస్య తలెత్తినప్పుడు రాళ్ల ఉప్పును వేడి నీటిలో కరిగించి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకొని పుక్కిలిస్తే పంటినొప్పి తీవ్రత తగ్గుతుంది పంటి నొప్పి ఉన్నచోట లవంగాన్ని అరగంటసేపు ఉంచడం వల్ల లేదా లవంగాల నూనెను దంతాలపై మర్దన చేసుకుంటే నొప్పి తీవ్రత తగ్గుతుంది.తొలగిస్తాయి.తెల్ల ఉల్లిపాయ రసంలో తేనె కలుపుకొని సేవిస్తే చిగుళ్లలో రక్తం కారే సమస్య తగ్గుతుంది.
వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే వేపలో ఉండే యాంటీ మైక్రోబియన్ గుణాలు దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాని సమర్థవంతంగా తొలగి అనేక దంత సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే దాదాపు 80 శాతం పంటి సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు