ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు పోటీపడి మరి అందానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ఫేస్ క్రీములను ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ వేళ్ళకు వేళ్ళు డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఈ రోజుల్లో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, వేడి, ఆహారపు అలవాట్లులో వస్తున్న మార్పు , హార్మోన్స్ పనితీరు, చర్మంలోనీ నూనె గ్రంథుల పనితీరు,బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వంటివి చర్మ సమస్యలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
మార్కెట్లో లభించే వివిధ రకాల స్కిన్ బ్యూటీ ప్రొడక్టులను వాడుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.కొంతమంది ఎంతో కష్టపడి మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ముఖంపై ఆయిల్ కప్పేసి జిడ్డుచర్మం గా మారుతుంది. దాంతో ముఖంపై ఉన్న శ్వేత గ్రంధులు మూసి పోయి చర్మంపై మచ్చలు , మొటిమలు ఏర్పడతాయి. దీంతో ముఖం ఎంతో అందవిహీనంగా కనిపించడమే కాకుండా చర్మ సౌందర్యం కూడా తగ్గిపోతుంది ఇలా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే ఏలకుల ఫేస్ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.
సుగంధ ద్రవ్యాలలో ఒకటైన యాలకులు మసాలా దినుసుగానే కాకుండా మన చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి.యాలకుల పొడిని పచ్చిపాలు మరియు తేనె మిశ్రమంలో కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకుని ముఖంపై నల్లటి వలయాలు, మచ్చలు, మొటిమలు ఉన్నచోట మర్దన చేయాలి. తరువాత 15 నిమిషాలకు చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే చర్మంపై ఉన్న బ్యాక్టీరియా నశించి కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.